Tuesday, September 19, 2017
Monday, September 11, 2017
గుంటూరు బయో పెస్టిసైడ్స్ ఎఫెక్ట్
Friday, September 1, 2017
Pesticides Formulations WDG/EC/FS/SC/GR
Monday, August 28, 2017
పురుగుల మందుల వాడకం PESTICIDES USING
పెద్దవంగర (గ్రామం/మండలం),
మహబూబాబాద్ జిల్లా,
తెలంగాణ స్టేట్ - 506317. ఇండియా.
Email ID: telanganafertilizers11@gmail.com
ఎప్పటికి పుచ్ఛి పళ్ళు రాకుండా చేసే అరుదైన చిట్కా !!
మన శరీరం లో గట్టిగ ఉండే భాగాలు మన పళ్లే, కానీ పంటికి సమస్యలు మాత్రం చాలా తొందరగా వచ్చేస్తాయి. రోజుకి నాలుగు సార్లు తిని పళ్ళకి పని చెప్తూ , వాటిని శుభ్రం చేసే పని వచ్చేసరికి రోజూ బ్రష్ చేయడానికి కూడా బద్దకిస్తారు కొంత మంది. మరి ఆలా చేస్తే పంటి సమస్యలు రాకుండా ఎక్కడికి పోతాయి.. మరి ఆ సమస్యల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..? డాక్టరు దగ్గరకి వెళ్తే వేలకి వేలు ఖర్చు పెట్టాలి కదా ..అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం మన పళ్ళని ధృడ పరుచుకోవచ్చు ఎలాగో మీరే తెలుసుకోండి…
మన ఇంట్లో ఎప్పుడూ ఉండే వాటిలో నువ్వుల నూనె కూడా ఒకటి. ఆ నువ్వులనూనెలో ఒక దూదిని ముంచి దాంతో చిగుర్ల మీద మర్దన చేసినట్లయితే చిగుళ్లు ధృడ పడతాయి. అలాగే నువ్వుల నూనెతో పుక్కిలించినా కూడా పళ్ళు చిగుర్లు ధృడ పది పంటి మీద ఉండే గార పోతుంది. ఉల్లిపాయని తీస్కొని దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ తో బ్రష్ చేసినట్లయితే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఆ ఘాటుకు బాక్టీరియా నాశనం అవుతుంది. భోజనం చేసిన వెంటనే తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అలాగే..
త్రిఫల కాషాయం కానీ ఉప్పునీటితో కానీ లేదా ఫ్లోరైడ్ నీటితో పుక్కిలిస్తే దంతాల్లో ఉండే బాక్టీరియా నాశనం అవువుతాయి. రోజుకి కేవలం మూడు సార్లే భోజనం చేయాలి. ఎప్పుడూ పడితే అప్పుడు తింటే దంత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే దంతాలు పుచ్చిపోవడానికి ముఖ్య కారణం.. అందులో ఉండే బాక్టీరియా, ఫంగస్ ఇది ముఖ్యంగా మన బ్రష్ నుండి వ్యాపిస్తుంది. ఒకే బ్రష్ ని ఎక్కువ కాలం ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సి ఉంటుంది. మన దంతాలు పాడయితే అవి మళ్ళీ తిరిగి పెరగవు, ఎంత పెట్టుడు పళ్ళు ఉన్నా అవ్వి ఒరిజినల్ దంతాలు కాదు కదా.. అందుకే అవ్వి పాడవకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది.
Wednesday, August 23, 2017
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలు / Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
-రాష్ట్రంలో ప్రధాని ఫసల్ బీమా యోజన వర్తింపుKEయూనిట్‌గా ఎంపిక
-నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం
పీఎంఎఫ్‌బీవై కింద పంటల బీమాను అమలుపర్చేందుకు రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి ఇన్సూరెన్స్ కంపెనీలను కేటాయించారు. అందులో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ క్లస్టర్ పరిధిలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేయనున్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్‌తోపాటు నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలను HTTP://GOIR.TELANGANA.GOV.IN వెబ్ సైట్‌ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
యూపీఐఎస్ కింద..:
నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకింద అమలుపరుస్తున్న యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్) కింద ఆరు విభాగాల్లో బీమా చేయించుకునే వీలు కల్పిస్తున్నారు. పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం వీటిలో ఎందులోనైనా బీమా చేయించే రైతులు యూపీఐఎస్ పరిధిలో వ్యక్తిగత ప్రమాదం, జీవిత బీమా, అగ్రికల్చర్ పంప్‌సెట్ ఇన్సూరెన్స్, ట్రాక్టర్ ఇన్సూరెన్స్, నివాసం స్థలం, కుటుంబ యజమాని, స్టూడెంట్ సేఫ్టీ బీమా వీటిలో కనీసం రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
వాతావరణ ఆధారిత పంటల బీమా
ఈ ఏడాది ఖరీఫ్‌నుంచి రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని అమలుపర్చాలని, ఇందుకోసం చర్యలు ప్రారంభించాలని సూచిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సీ పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పత్తిపంటకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. మిరప పంటకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, పామాయిల్‌కు ఖమ్మం జిల్లాలో, నల్లగొండలో బత్తాయి పంటకు బీమాను వర్తింపచేస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్)ను రాష్ట్రంలోఅమలుచేస్తూ ప్రభుత్వం నిర్దేశిత పంటలకు మండలం, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా నిర్ణయించి, ఆయా క్లస్టర్లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశారు.
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ క్లస్టర్ పరిధిలో పంటల బీమాకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. పంటల బీమా పథకం అమలులో భాగంగా బ్యాంకు రుణం పొందిన రైతులే కాకుండా.. బ్యాంకు రుణం పొందని రైతులకు కూడా వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు నిర్ణయించారు..!
Sunday, August 20, 2017
జీలకర్ర శక్తి ఏమిటో తెలిస్తే ఇక దాన్ని తినకుండా వదలరు...
తాలింపులో సుగంధ ద్రవ్యంగా జీలకర్రను వాడతాము. ఈ జీలకర్ర ఎలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి, గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు గలదు.
* అంతేకాదు వీర్యపుష్టి బలహీనంగా వున్నావారు, జీలకర్ర, బెల్లం, బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా కట్టుకొని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు, బి.పిని, షుగర్‌ను కంట్రోలులో ఉంచుతుంది.
* అజీర్ణంతో బాధపడేవారు, వికారంగా వున్నప్పుడు, అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి. మొలలతో బాధపడేవారు, జీలకర్ర, పసుపు కొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు మూడు పూటల రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. ఈవిధంగా మన వంటింట్లో వాడే దినుసులతో ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు.