మన శరీరం లో గట్టిగ ఉండే భాగాలు మన పళ్లే, కానీ పంటికి సమస్యలు మాత్రం చాలా తొందరగా వచ్చేస్తాయి. రోజుకి నాలుగు సార్లు తిని పళ్ళకి పని చెప్తూ , వాటిని శుభ్రం చేసే పని వచ్చేసరికి రోజూ బ్రష్ చేయడానికి కూడా బద్దకిస్తారు కొంత మంది. మరి ఆలా చేస్తే పంటి సమస్యలు రాకుండా ఎక్కడికి పోతాయి.. మరి ఆ సమస్యల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..? డాక్టరు దగ్గరకి వెళ్తే వేలకి వేలు ఖర్చు పెట్టాలి కదా ..అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం మన పళ్ళని ధృడ పరుచుకోవచ్చు ఎలాగో మీరే తెలుసుకోండి…
మన ఇంట్లో ఎప్పుడూ ఉండే వాటిలో నువ్వుల నూనె కూడా ఒకటి. ఆ నువ్వులనూనెలో ఒక దూదిని ముంచి దాంతో చిగుర్ల మీద మర్దన చేసినట్లయితే చిగుళ్లు ధృడ పడతాయి. అలాగే నువ్వుల నూనెతో పుక్కిలించినా కూడా పళ్ళు చిగుర్లు ధృడ పది పంటి మీద ఉండే గార పోతుంది. ఉల్లిపాయని తీస్కొని దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ తో బ్రష్ చేసినట్లయితే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఆ ఘాటుకు బాక్టీరియా నాశనం అవుతుంది. భోజనం చేసిన వెంటనే తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అలాగే..
త్రిఫల కాషాయం కానీ ఉప్పునీటితో కానీ లేదా ఫ్లోరైడ్ నీటితో పుక్కిలిస్తే దంతాల్లో ఉండే బాక్టీరియా నాశనం అవువుతాయి. రోజుకి కేవలం మూడు సార్లే భోజనం చేయాలి. ఎప్పుడూ పడితే అప్పుడు తింటే దంత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే దంతాలు పుచ్చిపోవడానికి ముఖ్య కారణం.. అందులో ఉండే బాక్టీరియా, ఫంగస్ ఇది ముఖ్యంగా మన బ్రష్ నుండి వ్యాపిస్తుంది. ఒకే బ్రష్ ని ఎక్కువ కాలం ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సి ఉంటుంది. మన దంతాలు పాడయితే అవి మళ్ళీ తిరిగి పెరగవు, ఎంత పెట్టుడు పళ్ళు ఉన్నా అవ్వి ఒరిజినల్ దంతాలు కాదు కదా.. అందుకే అవ్వి పాడవకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది.
0 comments:
Post a Comment