Wednesday, August 23, 2017

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలు / Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలు
Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)

తెలంగాణ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్  
పెద్దవంగర (గ్రామం/మండలం), 
మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ స్టేట్ - 506317. ఇండియా. 
 www.telanganafertilizers.blogspot.in  

Email ID: telanganafertilizers11@gmail.com


ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని తెలంగాణలో అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరంగా పంటల బీమా వర్తింప చేయనున్నారు. ఈ ఖరీఫ్ నుంచే రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుపర్చాలని సూచిస్తూ ప్రభుత్వ కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వపరంగా అమలుపర్చే బీమా పథకాన్ని గ్రామస్థాయి బీమా, మండలస్థాయి బీమా యూనిట్లుగా నిర్ణయించినట్టు తెలిపారు. యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్)ను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో అమలుపర్చనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ పథకంలో బ్యాంకునుంచి రుణం పొందిన, రుణం పొందని రైతులకు జూలై 31 వరకు ప్రీమియం చెల్లించేందుకు గడువు నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
 -రాష్ట్రంలో ప్రధాని ఫసల్ బీమా యోజన వర్తింపుKEయూనిట్‌గా ఎంపిక
-నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం 

పీఎంఎఫ్‌బీవై కింద పంటల బీమాను అమలుపర్చేందుకు రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి ఇన్సూరెన్స్ కంపెనీలను కేటాయించారు. అందులో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ క్లస్టర్ పరిధిలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేయనున్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్‌తోపాటు నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలను HTTP://GOIR.TELANGANA.GOV.IN వెబ్ సైట్‌ద్వారా తెలుసుకోవాలని సూచించారు.

యూపీఐఎస్ కింద..:


నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకింద అమలుపరుస్తున్న యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్) కింద ఆరు విభాగాల్లో బీమా చేయించుకునే వీలు కల్పిస్తున్నారు. పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం వీటిలో ఎందులోనైనా బీమా చేయించే రైతులు యూపీఐఎస్ పరిధిలో వ్యక్తిగత ప్రమాదం, జీవిత బీమా, అగ్రికల్చర్ పంప్‌సెట్ ఇన్సూరెన్స్, ట్రాక్టర్ ఇన్సూరెన్స్, నివాసం స్థలం, కుటుంబ యజమాని, స్టూడెంట్ సేఫ్టీ బీమా వీటిలో కనీసం రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

crops1

వాతావరణ ఆధారిత పంటల బీమా


ఈ ఏడాది ఖరీఫ్‌నుంచి రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని అమలుపర్చాలని, ఇందుకోసం చర్యలు ప్రారంభించాలని సూచిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సీ పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పత్తిపంటకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. మిరప పంటకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, పామాయిల్‌కు ఖమ్మం జిల్లాలో, నల్లగొండలో బత్తాయి పంటకు బీమాను వర్తింపచేస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్)ను రాష్ట్రంలోఅమలుచేస్తూ ప్రభుత్వం నిర్దేశిత పంటలకు మండలం, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా నిర్ణయించి, ఆయా క్లస్టర్లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశారు.

మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ క్లస్టర్ పరిధిలో పంటల బీమాకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. పంటల బీమా పథకం అమలులో భాగంగా బ్యాంకు రుణం పొందిన రైతులే కాకుండా.. బ్యాంకు రుణం పొందని రైతులకు కూడా వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు నిర్ణయించారు..!
PRIME MINISTER FASAL BIMA YOJANA ,IMPLEMENTATION ,TELANGANA,KHARIFF SEASON,CROP INSURANCE SCHEME,UPIS,PMFBY

0 comments:

Post a Comment