పత్తిలో గులాబీ పురుగు-నివారణ
వానకాలంలో రైతులు ఎక్కువ మొత్తంలో పత్తి సాగు చేస్తున్నారు. వాతావరణంలో వచ్చి మార్పుల వల్ల పత్తి పంటకు కొత్త రోగాలు వస్తున్నాయి. వీటి నివారణకు అధిక పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సమయంలో పత్తికి గులాబీరంగు పురుగు ఆశించింది. వ్యవసాయశాఖాధికారులు పంటను పరిశీలించి వీటి నివారణకు రైతులకు సూచనలు ఇస్తున్నారు.పత్తి నాటిన 45 రోజుల్లో పూతకు వస్తుంది. ఈ పూత దశను కాపాడేందుకు రైతులు రసాయన మం దులు పిచికారీ చేస్తారు. దీనివల్ల పత్తి ఆకులు బాగానే ఉన్నప్పటికీ పూత రాలిపోతుంది. రైతులు పత్తి మొక్కను పరిశీలిస్తే తప్పా గుర్తించడం కష్టమని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. పత్తి ఆకుల్లో పురుగు ఉంటుంది. అది పైకి కనిపించేసరికి నష్టం జరుగుతుంది.
గులాబీ పురుగును గుర్తించడం
పువ్వులో ఎక్కువగా గులాబీ పురుగులుంటాయి. ఇవి ఆకుల కింది భాగాన లేత కొమ్మలు, కాయల పైన గుడ్లును పెడుతాయి. దాదాపు రెండు నుంచి మూడు వందల వరకు గుడ్లను పెడుతాయి. గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు మొగ్గులోకి తొలుచుకొనిపోతాయి. చిన్న కాయలకు కనిపించినంత చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి గింజలను తినివేస్తాయి. దీనివల్ల కాయల్లో దూది బరువు తగ్గిపోతుంది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.పత్తిలో గులాబీ పురుగు పెరుగడానికి కారణం పంటకు నీరుపెట్టి ఎరువులు వేసి పంట కాలాన్ని పొడిగిస్తారు. జనవరి తర్వాత పత్తి పంటను చేనులో ఉంచకూడదు. జనవరి తర్వాత చేను లోతుగా దుక్కులు దున్నుకుంటే పురుగు పెరిగే అవకాశం ఉండదు. ఎండకు భూమిలో ఉన్న తెగులు చనిపోతుంది.పత్తికి గులాబీ పురుగు నివారణకు పత్తి పంటలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డిపూలు, రాలిన పూత పిందెలను ఎప్పటికప్పుడు ఏరివేసి సమూలంగా నాశనం చేయాలి. 5 మిల్లిలీటర్ల వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రొఫెనోపాస్, థయోకికార్బ్, క్లోర్ పైరిపాస్, క్వినాల్‌పాస్, స్పైనోసాడ్‌తో పాటు రకాల రసాయన మందులను 45 నుంచి 120 రోజుల వరకు మార్చి మార్చి వాడాలి. దీంతో పత్తి పంటలో ఉన్న పురుగులు తగ్గిపోతా
0 comments:
Post a Comment