పోషకాలు లోపిస్తే... (PLANT NUTRIENT DEFICIENCIES)
- పోషకాలు తగు మోతాదులో అందితేనే మొక్కలలో పెరుగుదల సాధ్యం
- మొక్కలలో పోషక లోప లక్షణాలపై రైతులకు అవగాహన అవసరం
- మొక్కలలో పోషక లోప లక్షణాలపై రైతులకు అవగాహన అవసరం
మొక్కలకు తగు మోతాదులో పోషకాలు అందనప్పుడు పెరుగుదల సక్రమంగా జరుగక దిగుబడు లు తగ్గుతాయి. మొక్కల్లో కనిపించే లక్షణాలను బట్టి పోషకాల లోపాన్ని గుర్తించాలి. ఆయా పోషకాలు గల ఎరువులు అందించాలి.నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతయి. లోపం తీవ్రత ఎక్కువైతే పొలం ఎండిపోయినట్లు కన్పిస్తుంది.
భాస్వరం లోపిస్తే మొక్క పెరుగుదల తగ్గి ముదురు ఆకు పచ్చరంగు కన్పిస్తుంది. ఆకులు చిన్నవిగా మారుతాయి. లోపం తీవ్రత ఎక్కువైతే ఆకుల అడుగుభాగాన గోధుమ రంగు మచ్చలేర్పడుతా యి. పొటాష్ లోపిస్తే ముదురు ఆకులు పసుపు పచ్చరంగులోకి మారుతాయి. ఆకుల చివర్లో తుప్పు మచ్చలేర్పడి ఆకుల అంచులు, కొనలు ముడుతపడి తర్వాత ఇరిగిపోతాయి. కాల్షియం లోపించినప్పుడు మొక్కలు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. కొత్తగా వచ్చే మొగ్గ ఆకులు పసుపు రంగుకు మారుతాయి. లోపం ఎక్కువైతే ఆకు అంచుల నుంచి ఎండటం మొదలవుతాయి. మెగ్నీషియం లోపించినప్పుడు ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారడం మొదలై తర్వాత ప్రధా న ఈనెకు ఇరువైపులా పసుపు పచ్చ మచ్చలేర్పడి ఇవి క్రమేపీ పెద్దవై ఆనెకు ఇరువైపులా తిరుగబడిన వి ఆకారంలో ఆకుపచ్చ భాగం మిగులుతుంది. లోపం తీవ్రత ఎక్కువైతే ఆకులు రాలిపోతాయి.
గంధకం లోపిస్తే ఆకుల మీద పసుపు పచ్చ మచ్చలేర్పడుతాయి. ఆకులు పసుపురంగులోకి మారి ముడుచుకొని చిన్నగా అవుతాయి. మొక్కల్లో వేర్ల అభివృద్ధి ఆగిపోతుంది. జింక్ లోపిస్తే మొక్కల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారుతుంది. కొత్త ఆకులు చిన్న వై మొక్క కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకులపై తుప్పు రంగు మచ్చలేర్పడుతాయి. ఇనుము లోపిస్తే లేత ఆకులు పసుపు రంగులోకి, ఈనెలు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. లోపం మరీ ఎక్కువైతే ఆకుల ఈనెలు కూడా తెల్ల గా పాలిపోతాయి. బోరాన్ లోపం వల్ల కొత్తగా వచ్చే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చ రంగు కోల్పోవడం తెల్లని చారలు ఏర్పడటం, చిగురు ఆకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరుగడం మందంగా తయారవ్వడం ఉంటుంది. లోపం బాగా ఎక్కువుంటే మొక్క చివరి భాగంలో ని మొగ్గలు చనిపోతాయి. మొగ్గలు, లేత కాయల అడుగుభాగంలో పగుళ్ళు ఏర్పడుతాయి.మాంగనీస్ లోపిస్తే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఈనెలను ఆనుకొని ఉన్న భాగం మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది.
మాలిబ్డినం లోపిస్తే ఆకులు లేత పసుపురంగులోకి మారుతాయి. ఈనెలు తప్ప మిగిలిన ఆకు భాగం మీద పసుపునుంచి నారింజ రంగు మచ్చలేర్పడుతాయి. లోపం ఉన్న చోట బంక కారుతుంది. రాగి ఇది లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపురంగులోకి మారుతుంది. కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. కొమ్మ ఎండిపోయి కాయలపై ఇటుక రంగు మచ్చలేర్పడుతాయి.
0 comments:
Post a Comment