Tuesday, September 19, 2017
Monday, September 11, 2017
గుంటూరు బయో పెస్టిసైడ్స్ ఎఫెక్ట్
Friday, September 1, 2017
Pesticides Formulations WDG/EC/FS/SC/GR
Monday, August 28, 2017
పురుగుల మందుల వాడకం PESTICIDES USING
పెద్దవంగర (గ్రామం/మండలం),
మహబూబాబాద్ జిల్లా,
తెలంగాణ స్టేట్ - 506317. ఇండియా.
Email ID: telanganafertilizers11@gmail.com
ఎప్పటికి పుచ్ఛి పళ్ళు రాకుండా చేసే అరుదైన చిట్కా !!
మన శరీరం లో గట్టిగ ఉండే భాగాలు మన పళ్లే, కానీ పంటికి సమస్యలు మాత్రం చాలా తొందరగా వచ్చేస్తాయి. రోజుకి నాలుగు సార్లు తిని పళ్ళకి పని చెప్తూ , వాటిని శుభ్రం చేసే పని వచ్చేసరికి రోజూ బ్రష్ చేయడానికి కూడా బద్దకిస్తారు కొంత మంది. మరి ఆలా చేస్తే పంటి సమస్యలు రాకుండా ఎక్కడికి పోతాయి.. మరి ఆ సమస్యల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..? డాక్టరు దగ్గరకి వెళ్తే వేలకి వేలు ఖర్చు పెట్టాలి కదా ..అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం మన పళ్ళని ధృడ పరుచుకోవచ్చు ఎలాగో మీరే తెలుసుకోండి…
మన ఇంట్లో ఎప్పుడూ ఉండే వాటిలో నువ్వుల నూనె కూడా ఒకటి. ఆ నువ్వులనూనెలో ఒక దూదిని ముంచి దాంతో చిగుర్ల మీద మర్దన చేసినట్లయితే చిగుళ్లు ధృడ పడతాయి. అలాగే నువ్వుల నూనెతో పుక్కిలించినా కూడా పళ్ళు చిగుర్లు ధృడ పది పంటి మీద ఉండే గార పోతుంది. ఉల్లిపాయని తీస్కొని దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ తో బ్రష్ చేసినట్లయితే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఆ ఘాటుకు బాక్టీరియా నాశనం అవుతుంది. భోజనం చేసిన వెంటనే తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అలాగే..
త్రిఫల కాషాయం కానీ ఉప్పునీటితో కానీ లేదా ఫ్లోరైడ్ నీటితో పుక్కిలిస్తే దంతాల్లో ఉండే బాక్టీరియా నాశనం అవువుతాయి. రోజుకి కేవలం మూడు సార్లే భోజనం చేయాలి. ఎప్పుడూ పడితే అప్పుడు తింటే దంత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే దంతాలు పుచ్చిపోవడానికి ముఖ్య కారణం.. అందులో ఉండే బాక్టీరియా, ఫంగస్ ఇది ముఖ్యంగా మన బ్రష్ నుండి వ్యాపిస్తుంది. ఒకే బ్రష్ ని ఎక్కువ కాలం ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సి ఉంటుంది. మన దంతాలు పాడయితే అవి మళ్ళీ తిరిగి పెరగవు, ఎంత పెట్టుడు పళ్ళు ఉన్నా అవ్వి ఒరిజినల్ దంతాలు కాదు కదా.. అందుకే అవ్వి పాడవకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది.
Wednesday, August 23, 2017
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలు / Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
-రాష్ట్రంలో ప్రధాని ఫసల్ బీమా యోజన వర్తింపుKEయూనిట్‌గా ఎంపిక
-నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం
పీఎంఎఫ్‌బీవై కింద పంటల బీమాను అమలుపర్చేందుకు రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి ఇన్సూరెన్స్ కంపెనీలను కేటాయించారు. అందులో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ క్లస్టర్ పరిధిలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేయనున్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్‌తోపాటు నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలను HTTP://GOIR.TELANGANA.GOV.IN వెబ్ సైట్‌ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
యూపీఐఎస్ కింద..:
నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకింద అమలుపరుస్తున్న యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్) కింద ఆరు విభాగాల్లో బీమా చేయించుకునే వీలు కల్పిస్తున్నారు. పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం వీటిలో ఎందులోనైనా బీమా చేయించే రైతులు యూపీఐఎస్ పరిధిలో వ్యక్తిగత ప్రమాదం, జీవిత బీమా, అగ్రికల్చర్ పంప్‌సెట్ ఇన్సూరెన్స్, ట్రాక్టర్ ఇన్సూరెన్స్, నివాసం స్థలం, కుటుంబ యజమాని, స్టూడెంట్ సేఫ్టీ బీమా వీటిలో కనీసం రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
వాతావరణ ఆధారిత పంటల బీమా
ఈ ఏడాది ఖరీఫ్‌నుంచి రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని అమలుపర్చాలని, ఇందుకోసం చర్యలు ప్రారంభించాలని సూచిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సీ పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పత్తిపంటకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. మిరప పంటకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, పామాయిల్‌కు ఖమ్మం జిల్లాలో, నల్లగొండలో బత్తాయి పంటకు బీమాను వర్తింపచేస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్)ను రాష్ట్రంలోఅమలుచేస్తూ ప్రభుత్వం నిర్దేశిత పంటలకు మండలం, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. రాష్ట్రంలోని 9 జిల్లాలను 3 క్లస్టర్లుగా నిర్ణయించి, ఆయా క్లస్టర్లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశారు.
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ క్లస్టర్ పరిధిలో పంటల బీమాకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల క్లస్టర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల క్లస్టర్ పరిధిలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంటల బీమా అమలుచేయనున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. పంటల బీమా పథకం అమలులో భాగంగా బ్యాంకు రుణం పొందిన రైతులే కాకుండా.. బ్యాంకు రుణం పొందని రైతులకు కూడా వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు నిర్ణయించారు..!
Sunday, August 20, 2017
జీలకర్ర శక్తి ఏమిటో తెలిస్తే ఇక దాన్ని తినకుండా వదలరు...
తాలింపులో సుగంధ ద్రవ్యంగా జీలకర్రను వాడతాము. ఈ జీలకర్ర ఎలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి, గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు గలదు.
* అంతేకాదు వీర్యపుష్టి బలహీనంగా వున్నావారు, జీలకర్ర, బెల్లం, బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా కట్టుకొని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు, బి.పిని, షుగర్‌ను కంట్రోలులో ఉంచుతుంది.
* అజీర్ణంతో బాధపడేవారు, వికారంగా వున్నప్పుడు, అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి. మొలలతో బాధపడేవారు, జీలకర్ర, పసుపు కొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు మూడు పూటల రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. ఈవిధంగా మన వంటింట్లో వాడే దినుసులతో ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు.
Friday, August 18, 2017
సబ్సిడీపై వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల వివరాలు
సబ్సిడీపై వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల వివరాలు
తెలంగాణ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్
పెద్దవంగర (గ్రామం/మండలం),
మహబూబాబాద్ జిల్లా,
తెలంగాణ స్టేట్ - 506317. ఇండియా.
www.telanganafertilizers.blogspot.in
Email ID: telanganafertilizers11@gmail.com
Thursday, August 17, 2017
మల్బరీ చెట్లతో కరువుకు విముక్తి - Malabar Farming Information
- ఎకరానికి 650 మల్బరీ చెట్లు పెంచితే చాలు.. మూడేళ్ల తర్వాత నెలకోసారి నీరిస్తే చాలు
- అధిక సాంద్రత మల్బరీ సాగులో వాడే నీటిలో 10–15% నీటితోనే మల్బరీ చెట్ల సాగు
- యంత్రాల వాడకానికి, అంతరపంటల సాగుకు వీలు..
- కరువు పీడిత ప్రాంతాల రైతులకు ప్రయోజనం
- కోలారు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మక సాగు చేపట్టిన అభ్యుదయ రైతులు
కరువు పీడిత ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు చక్కని ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి వేలాది (అత్యధికంగా 5,500) మొక్కలను నాటి వత్తుగా సాగు చేస్తూ.. నెలకో పంట తీస్తున్నారు. అయితే, ఈ తోటలకు ఏడాది పొడవునా వారానికోసారి నీటి తడులు ఇవ్వాల్సి వస్తున్నది. నీటిని తక్కువగా వాడుకునే పద్ధతులను వెతుక్కునే క్రమంలో ‘ట్రీ మల్బరీ’ పద్ధతి ముందుకు వచ్చింది. ఎకరానికి 650 మల్బరీ చెట్లను తక్కువ నీటితోనే సాగు చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. పాత పద్ధతితో పోల్చితే 10–15 శాతం నీటితోనే మల్బరీ చెట్లను సాగు చేయవచ్చన్న మాట. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
పట్టు పెంపకానికి నెలవైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో గత కొన్నేళ్లుగా వర్షాలు తగ్గాయి. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలోనూ కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి రైతులు నీటి ఎద్దడిని తట్టుకొనేందుకు మల్బరీ మొక్కలను వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని గత సంవత్సరం నుంచి చేపట్టారు. దీన్ని స్వయంగా చూసి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతులు మల్బరీ చెట్లను ప్రయోగాత్మకంగా సాగు చేయనారంభించారు. సాధారణంగా మల్బరీ చేలల్లో సాళ్ల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి అధిక సాంద్రతలో సాగు చేయడం రైతులకు అలవాటు.
మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరిగే లోపే కట్ చేసి ఆకులను పట్టుపురుగులకు మేతగా వేసేవారు. ఆ మొక్కలకు మళ్లీ ఎరువులు వేసి నీటిని అందించి తదుపరి పంటకు సిద్ధమయ్యేవారు. ఈ క్రమంలో వారానికోసారి మల్బరీ పంటకు నీటిని అందివ్వాల్సిందే. నీటి తడులు ఏమాత్రం ఆలస్యమైనా పంట ఎండిపోయేది.
పలమనేరు మండలం బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి, గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి శెట్టి తొలి నుంచి మల్బరీ సాగులో పలు ప్రయోగాలు చేసిన రైతులే. వీరు కర్ణాటక రైతులను చూసి పొలాల్లో మల్బరీ మొక్కలను పెద్ద వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అధిక సాంద్రతలో సాగుచేసే మల్బరీ తోటలో సాళ్ల మధ్య అంతర పంటలను సాగు చేసేందుకు వీలుండదు. కానీ, మల్బరీ చెట్ల మధ్యలో రాగి, కొత్తిమీర, ఉలవ, జొన్న, కంది, అలసంద, వివిధ రకాల ఆకుకూరలు, పశుగ్రాసం తదితర అంతర పంటలను సాగు చేసుకోవచ్చు.
పశువులు, జీవాలకు మేతగా మల్బరీ ఆకు :
కోలారు రైతులు మల్బరీ ఆకును పశువులు, జీవాలకు మేతగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనంగా కొంత ఆదాయమూ లభిస్తోంది. కొందరు రైతులయితే మల్బరీ చెట్లను పెంచుతూ.. ఆకును పట్టు పురుగులను పెంచే రైతులకు విక్రయిస్తున్నారు.
ఎకరంలో 805 మల్బరీ చెట్లు :
చిత్తూరు జిల్లాకు చెందిన రైతు గురుమూర్తి శెట్టి కోలారు వెళ్లి మల్బరీ చెట్ల సాగును స్వయంగా చూసి వచ్చి.. వర్షాధారంగా జీ –4 రకం మల్బరీ చెట్ల సాగును చేపట్టారు. 9“2 దూరంలో 2,750 మొక్కలు నాటారు. 2 ఏళ్ల తర్వాత సాలు మధ్యలో నుంచి కొన్ని మొక్కలను, మరో 2 ఏళ్లకు మరికొన్ని మొక్కలను తీసేస్తామన్నారు. అప్పటికి 9“6 దూరంలో ఎకరాకు 805 చెట్లు మిగులుతాయన్నారు.
– పిచ్చిగుంట్ల సుబ్రమణ్యం,సాక్షి, పలమనేరు, చిత్తూరు జిల్లా
మల్బరీ చెట్లతో కరువులోనూ మెరుగైన ఫలితాలు :
కర్ణాటకలోని కోలారు జిల్లాలో నీటి కరువు ఎక్కువ. అయినా మల్బరీ సాగులో దేశంలోనే పేరు పొందింది. చిత్తూరు జిల్లాతో పోల్చితే అక్కడే నీటి కరువు ఎక్కువ. అయినా అక్కడి రైతులు మల్బరీ చెట్ల సాగు ద్వారా మెరుగైన పలితాలను సాధించడం చూశా. దీంతో నేను ప్రయోగాత్మకంగా రెండు ఎకరాల్లో సాగు చేశా. మరో రెండేళ్లలో మల్బరీ మొక్కలు వృక్షాలుగా పెరుగుతాయి. అప్పుడు రైతులకు దీనితో కలిగే ఉపయోగాల గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. మామూలుగా 600 గూళ్లకు కిలో దిగుబడి వస్తే.. మల్బరీ చెట్ల ఆకులతో 380 గూళ్లకే కిలో దిగుబడి వచ్చిందని కర్ణాటక రైతులు తెలిపారు.
మూడేళ్ల తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు :
ఎకరాలో మల్బరీ చెట్లు పెంచుతున్నా. 9“4 అడుగుల దూరంలో ఎకరానికి 1,800 మొక్కలను, 3 అడుగుల లోతులో నాటాము. 3 ఏళ్ల వరకు డ్రిప్‌తో నీరిస్తే తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు. 3–4 అడుగుల ఎత్తున ప్రూనింగ్ చేస్తాం. కొమ్మ పద్ధతిలో 2“2, 2“3 దూరంలో నాటిన మల్బరీ తోటలో.. ఏటా నేల మట్టానికి ప్రూనింగ్ చేసినప్పుడు 5% మొక్కలు చనిపోతాయి. 15 ఏళ్ల తర్వాత మళ్లీ నాటాలి. అయితే, మల్బరీ చెట్లు పెంచితే ఆ సమస్య ఉండదు. ఈ చెట్లు వందేళ్ల వరకు మల్బరీ ఆకు దిగుబడినిస్తాయి.
డిసెంబర్ నాటికి మల్బరీ చెట్ల సాగు పద్ధతి ఖరారు :
నీటి వసతి ఉన్న రైతులు మల్బరీ తోటల్లో సాధారణంగా ఎకరానికి 5,500 మొక్కలు నాటి, నెలకో పంట తీస్తున్నారు. నీరు పరిమితంగా ఉన్న రైతులు 8“8 దూరంలో ఎకరానికి 680 మల్బరీ చెట్లను 10–15% నీటితోనే సాగుచేయవచ్చు. ట్రాక్టరు, యంత్రాలను ఉపయోగించడం సులువు అవుతుంది. మైసూరులోని కేంద్రీయ పట్టు పరిశోధన, శిక్షణా సంస్థ (ఇది సెంట్రల్ సిల్క్ బోర్డు పరిధిలో ఉంది)లో మల్బరీ చెట్ల పెంపకంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో సాగు పద్ధతి ఖరారవుతుంది. వీ1 లేదా జీ4 లేదా ఎం.ఎస్.జి–2 రకాలేవైనా వర్షాకాలంలో నాటుకోవచ్చు.
– డా. జీ వీ ప్రసాద్ (94908 40430), శాస్త్రవేత్త, పరిశోధన విస్తరణ కేంద్రం,కేంద్రీయ పట్టు బోర్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా
మల్బరీ చెట్లతో లాభాలెన్నో..
► బోదెల (సాళ్లు) మధ్య దూరం 9 అడుగులు ఉంటుంది కాబట్టి.. మల్బరీ చెట్ల మధ్య ట్రాక్టరుతో సులభంగా అంతర కృషి చేసుకోవచ్చు. కలుపు కూలీల ఖర్చు తగ్గుతుంది..
► మల్బరీ చెట్లను నాలుగు అడుగుల ఎత్తులోనే కట్ చేసి మినీ ట్రాక్టర్ ట్రాలీలోకి వేసుకోవచ్చు.
► నలుగురు చేసే పనిని ఇద్దరు చేసుకోవచ్చు.
► గతంలో మాదిరిగా వారానికో తడి కాకుండా (మూడేళ్ల తర్వాత మల్బరీ చెట్లకు) నెలకోసారి నీటి తడులను అందివ్వొచ్చు.
► ఒక్కసారి డ్రిప్ పైపులను అమర్చితే చాలు. తరచూ మార్చాల్సిన పని ఉండదు.
► దీంతో మల్బరీ చెట్టుకు గుబురుగా కొమ్మలు పెరుగుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన 20 మల్బరీ మొక్కల నుంచి వచ్చే ఆకు దిగుబడిని ఒక చెట్టు నుంచే పొందవచ్చు.
► మల్బరీ చెట్లకు ఆకులు నాణ్యంగా, మందంగా పెరుగుతాయి. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి.
► నాలుగో జ్వరం దశ (చివరి ఆరు రోజులు) లో పట్టు పురుగులు మామూలుగా తీసుకునే ఆహారం కన్నా నాలుగు రెట్ల ఆకును అధికంగా తీసుకుంటాయి. ఈ చెట్ల నుంచి లభించే ఆకు నాణ్యంగా ఉండటం వల్ల పట్టు గూళ్ల దిగుబడి బాగుంటుంది.
► ఆకుల్లో తేమ తక్కువగా ఉండటం, పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పట్టు పురుగులకు మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. నాణ్యమైన ఆకును పురుగులు ఆహారంగా తీసుకోవడంతో రోగాల బెడద ఉండదు.
► చెట్లకు నాలుగు అడుగులపైన కొత్తగా వచ్చిన కొమ్మలకు ఆకు పెరుగుతుంది కాబట్టి పండు ఆకులు, మట్టి అంటిన ఆకుల సమస్య ఉండదు.
► మామూలు మల్బరీ ఆకుతో వంద పట్టు గుడ్లకు 70 కిలోల గూళ్ళు ఉత్పత్తి అవుతాయి. మల్బరీ చెట్ల నాణ్యమైన ఆకుతో వంద గుడ్లకు 90 కిలోలకు పైగా పంట వస్తుంది.
► వేసవిలో నీటి సమస్య ఉన్న రైతులకు మల్బరీ చెట్ల పెంపకం ఎంతో ఉపయోగకరం.
ముల్కనూర్‌కు మహిళా సంఘల బలం - Dairy Farming in India
పరస్పర సహాయ సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్ కంపెనీలు(ఎఫ్.పి.సి.లు)గా ఏర్పడితే.. సాగు ఖర్చులు తగ్గించుకోవడం, తమ ఉత్పత్తులను తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటూ నికరాదాయాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందన్నది భావన. భావన మంచిదే∙అయినా.. విధాన లోపం వల్ల సహకార ఫలాలు రైతులకు బాసటగా నిలవలేకపోతున్నాయి. వ్యవసాయేతర స్థిరాస్తులు తనఖా పెడితేనే రుణాలిస్తామని బ్యాంకులు భీష్మిస్తున్నాయి. అందువల్లనే పట్టణ ప్రాంతాల్లోని బలమైన సొసైటీలే రుణాల్లో సింహభాగాన్ని తన్నుకుపోతున్నాయన్న విమర్శ ఉంది. గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలకు మాత్రం కష్టాలతో కాపురం తప్పటం లేదు!
♦ మహిళా రైతులకు ఆదాయ భద్రత!
♦ ముల్కనూర్ మహిళా రైతుల సహకార డెయిరీ దేశానికే ఆదర్శం
♦ 20 వేల మంది సభ్యులు.. 50 వేల పాడి పశువులు
♦ ఏటా రూ. 90 కోట్ల లావాదేవీల స్థాయికి దినదినాభివృద్ధి
తెలంగాణ మారుమూల పల్లెల్లో పుట్టిపెరిగిన ముల్కనూరు ప్రాంత మహిళా రైతులు ‘కవ్వమాడిన చోట కరువు ఉండదు’ అన్న పెద్దల మాటను వంట పట్టించుకున్నారు. వారు డిగ్రీలు చదువుకోలేదు, కానీ అక్షరాలు నేర్చుకున్నారు. చేయీ చేయీ కలిపి.. రూపాయికి రూపాయి జమ చేసి పొదుపు అలవాటు చేసుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు తాము కూడబెట్టుకున్న పొదుపు సొమ్ముతోనే ఏకంగా మహిళా డెయిరీనే నెలకొల్పి.. రూ. కోట్ల సంపదను సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత రూ. 90 కోట్ల వార్షిక లావాదేవీలు నిర్వహించే స్థితికి ఎదిగారు. తమ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా ఆదాయ భద్రతను చేకూర్చే వెలుగుబాట చూపారు. ముల్కనూరు రైతు మహిళలు చూపిన సహకార స్ఫూర్తి, పట్టుదల, కృషి, దృఢ సంకల్పానికి ఇవాళ దేశం యావత్తూ జేజేలు పలుకుతోంది...
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే సూక్తిని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ప్రాంత మహిళా రైతుల సహకార స్ఫూర్తిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వరస కరువులతో పంటలు ఎండిపోతూ... పెట్టుబడులు కూడా తిరిగి రాని దైన్యం నుంచి గట్టెక్కేందుకు మహిళలు ఇంటికి ఒకటి, రెండు పాడి పశువులను పెంచుతూ పాల ఉత్పత్తితో ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. ముల్కనూర్ పేరును ‘మిల్క్’నూర్‌గా మార్చారు. దేశంలోనే ప్రప్రథమంగా ముల్కనూర్‌లో మహిళల భాగస్వామ్యంతో డెయిరీని నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం విశేషం.
1999లో ముల్కనూరు మండలంలోని ముస్తఫాపూర్‌లో 20 మంది మహిళలు పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో ఆ గ్రామం, మండలంలోని మహిళలంతా పొదుపు ఉద్యమంలో చేరారు. మహిళా సంఘాలు చిన్నపాటి బ్యాంక్‌లుగా మారాయి. అలా కూడబెట్టిన సొంత సొమ్మును దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా పెట్టుబడి పెట్టడం ఎలా? అని ఆలోచిస్తూ మహిళా పొదుపు సంఘాల బాధ్యులు డెయిరీని నెలకొల్పాలని నిర్ణయించారు. రైతుల సహకారోద్యమానికి ముల్కనూరు అప్పటికే పెట్టింది పేరు. ముల్కనూరు రైతు సహకారోద్యమ నేత విశ్వనాథరెడ్డి చూపిన ‘సహకారం, సేవ’ లక్ష్యాల వెలుగులో మహిళలు సంఘటితంగా ముందుకు నడిచారు.
జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తోడ్పాటుతో కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్(సి.డి.ఎఫ్.) మార్కెట్ సర్వే చేసి, ముల్కనూరు ప్రాంతంలో డెయిరీ ఆవశ్యకత ఉందని నిర్ధారించింది. దేశంలోనే మొట్టమొదటిదైన ‘ముల్కనూరు మహిళా పరస్పర సహాయ సహకార డెయిరీ’ ఆ విధంగా రూపుదాల్చింది. స్వకృషి బ్రాండ్ పేరిట పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ, దినదినాభివృద్ధి సాధిస్తూ మహిళా సహకార స్ఫూర్తిని దశదిశలా చాటుతున్నారు. వీరి కృషికి మెచ్చి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ తదితర ప్రముఖులు కితాబునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ. 7 కోట్ల పెట్టుబడితో మండలంలోని ముల్కనూర్‌లో ఆగస్టు 17, 2002న డెయిరీ ప్రారంభమయింది. నేడు వరంగల్ అర్బన్, కరీంనగర్, సిద్ధిపేట, జనగామ జిల్లాల్లోని 140 గ్రామాల్లో 40వేలకు పైచిలుకు పాడి గేదెలు, ఆవులు ఉన్నాయి. పాల సంఘాల ద్వారా రోజూ 40 వేల లీటర్లకు పైగా సేకరిస్తున్నారు. గేదె పాలకు అత్యధికంగా సగటున లీటరుకు రూ.41.30, ఆవు పాలకు లీటర్‌కు రూ. 26.87 చెల్లిస్తున్నారు. ఇక అన్ని గ్రామాల్లోని పాల సంఘాలు కంప్యూటీకరించారు. 15 రోజులకోసారి రైతులకు నగదు చెల్లిస్తున్నారు.
ఏటా రూ. 90 కోట్ల వ్యాపారం
ముల్కనూర్ డెయిరీ ‘స్వకృషి’ బ్రాండ్ పేరుతో సుమారు 10 తెలంగాణ జిల్లాల్లో పాలు, పెరుగు, నెయ్యి, లస్సీ, స్వీట్ లస్సీ, మజ్జిగ, దూద్‌పేడ్, స్వీట్లు విక్రయిస్తుంది. 20 వేల సభ్యులతో ఏటా లాభాల బాటలో పయనిస్తున్నది. డెయిరీ పాలకవర్గ సభ్యులు 12 మంది ప్రతి నెలా సమావేశమై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటారు. డెయిరీ సిబ్బంది, పాల సంఘాల కార్యదర్శులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తారని జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి (99088 55114) తెలిపారు.
నాణ్యతలో రాజీ లేకుండా శుభ్రమైన, స్వచ్ఛమైన పాలు, పాలపదార్థాలను విక్రయిస్తున్నామని, రూ. 90 కోట్ల వార్షిక ఆర్థిక లావాదేవీలతో లాభాల బాటలో పయనిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నాలుగు సార్లు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. 2012 డిసెంబర్ 6న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డును డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల అందుకున్నారు. వ్యవసాయంలో అధిక పని గంటలు శ్రమించే మహిళలు స్వయంగా డెయిరీని నెలకొల్పి అభ్యున్నతికి పాటుపడటం చాలా గొప్ప సంగతి.
ఒక ఆవుకు రూ. 22,500 మిగులుతయి!
ఎకరం భూమిలో పత్తి పంట పెడితే కాలం మంచిగ అయి పంట పండితే రూ. 30 వేలు వత్తయి. పెట్టుబడి పోను రూ. 15 వేలు లాభం ఉంటది. వర్షాలు లేకపోతే పంట పండది. అప్పులే మిగులుతాయి. ఒక ఆవును పెంచుకుంటే ఖర్చులు పోను 10 నెలల్లో రూ. 22,500 మిగులుతయి. మాకు 2 ఆవులున్నాయి. రోజూ 4 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తా. నెలకు రూ. 3 వేల పాల బిల్లు ఎత్తుకుంటా. ఈ డబ్బుతోనే మా కుటుంబం గడుస్తున్నది.









