Friday, August 18, 2017

సబ్సిడీపై వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల వివరాలు

సబ్సిడీపై వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల వివరాలు

తెలంగాణ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్

పెద్దవంగర (గ్రామం/మండలం),
మహబూబాబాద్ జిల్లా,
తెలంగాణ స్టేట్ - 506317. ఇండియా.
www.telanganafertilizers.blogspot.in
Email ID: telanganafertilizers11@gmail.com

Thursday, August 17, 2017

మల్బరీ చెట్లతో కరువుకు విముక్తి - Malabar Farming Information

మల్బరీ చెట్లతో కరువుకు విముక్తి
Malabar Farming Information

- మల్బరీ సాగులో కొత్తపోకడ ‘ట్రీ మల్బరీ’
- 
ఎకరానికి 650 మల్బరీ చెట్లు పెంచితే చాలు.. మూడేళ్ల తర్వాత నెలకోసారి నీరిస్తే చాలు
- 
అధిక సాంద్రత మల్బరీ సాగులో వాడే నీటిలో 10–15% నీటితోనే మల్బరీ చెట్ల సాగు
- 
యంత్రాల వాడకానికి, అంతరపంటల సాగుకు వీలు..
- 
కరువు పీడిత ప్రాంతాల రైతులకు ప్రయోజనం
- 
కోలారు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మక సాగు చేపట్టిన అభ్యుదయ రైతులు

కరువు పీడిత ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు చక్కని ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి వేలాది (అత్యధికంగా 5,500) మొక్కలను నాటి వత్తుగా సాగు చేస్తూ.. నెలకో పంట తీస్తున్నారు. అయితే, ఈ తోటలకు ఏడాది పొడవునా వారానికోసారి నీటి తడులు ఇవ్వాల్సి వస్తున్నది. నీటిని తక్కువగా వాడుకునే పద్ధతులను వెతుక్కునే క్రమంలో ‘ట్రీ మల్బరీ’ పద్ధతి ముందుకు వచ్చింది.  ఎకరానికి 650 మల్బరీ చెట్లను తక్కువ నీటితోనే సాగు చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. పాత పద్ధతితో పోల్చితే 10–15 శాతం నీటితోనే మల్బరీ చెట్లను సాగు చేయవచ్చన్న మాట. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..

పట్టు పెంపకానికి నెలవైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో గత కొన్నేళ్లుగా వర్షాలు తగ్గాయి. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలోనూ కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి రైతులు నీటి ఎద్దడిని తట్టుకొనేందుకు మల్బరీ మొక్కలను వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని గత సంవత్సరం నుంచి చేపట్టారు. దీన్ని స్వయంగా చూసి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతులు మల్బరీ చెట్లను ప్రయోగాత్మకంగా సాగు చేయనారంభించారు. సాధారణంగా మల్బరీ చేలల్లో సాళ్ల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి అధిక సాంద్రతలో సాగు చేయడం రైతులకు అలవాటు.

మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరిగే లోపే కట్‌ చేసి ఆకులను పట్టుపురుగులకు మేతగా వేసేవారు. ఆ మొక్కలకు మళ్లీ ఎరువులు వేసి నీటిని అందించి తదుపరి పంటకు సిద్ధమయ్యేవారు. ఈ క్రమంలో వారానికోసారి మల్బరీ పంటకు నీటిని అందివ్వాల్సిందే. నీటి తడులు ఏమాత్రం ఆలస్యమైనా పంట ఎండిపోయేది.

పలమనేరు మండలం బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి, గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి శెట్టి తొలి నుంచి మల్బరీ సాగులో పలు ప్రయోగాలు చేసిన రైతులే. వీరు కర్ణాటక రైతులను చూసి పొలాల్లో మల్బరీ మొక్కలను పెద్ద వృక్షాలుగా పెంచే కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అధిక సాంద్రతలో సాగుచేసే మల్బరీ తోటలో సాళ్ల మధ్య అంతర పంటలను సాగు చేసేందుకు వీలుండదు. కానీ, మల్బరీ చెట్ల మధ్యలో రాగి, కొత్తిమీర, ఉలవ, జొన్న, కంది, అలసంద, వివిధ రకాల ఆకుకూరలు, పశుగ్రాసం తదితర అంతర పంటలను సాగు చేసుకోవచ్చు.  

పశువులు, జీవాలకు మేతగా మల్బరీ ఆకు :
కోలారు రైతులు మల్బరీ ఆకును పశువులు, జీవాలకు మేతగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనంగా కొంత ఆదాయమూ లభిస్తోంది. కొందరు రైతులయితే మల్బరీ చెట్లను పెంచుతూ.. ఆకును పట్టు పురుగులను పెంచే రైతులకు విక్రయిస్తున్నారు.

ఎకరంలో 805 మల్బరీ చెట్లు :
చిత్తూరు జిల్లాకు చెందిన రైతు గురుమూర్తి శెట్టి కోలారు వెళ్లి మల్బరీ చెట్ల సాగును స్వయంగా చూసి వచ్చి.. వర్షాధారంగా జీ –4 రకం మల్బరీ చెట్ల సాగును చేపట్టారు. 9“2 దూరంలో 2,750 మొక్కలు నాటారు. 2 ఏళ్ల తర్వాత సాలు మధ్యలో నుంచి కొన్ని మొక్కలను, మరో 2 ఏళ్లకు మరికొన్ని మొక్కలను తీసేస్తామన్నారు. అప్పటికి 9“6 దూరంలో ఎకరాకు 805 చెట్లు మిగులుతాయన్నారు.
–
పిచ్చిగుంట్ల సుబ్రమణ్యం,సాక్షి, పలమనేరు, చిత్తూరు జిల్లా

మల్బరీ చెట్లతో కరువులోనూ మెరుగైన ఫలితాలు :
కర్ణాటకలోని కోలారు జిల్లాలో నీటి కరువు ఎక్కువ. అయినా మల్బరీ సాగులో దేశంలోనే పేరు పొందింది.  చిత్తూరు జిల్లాతో పోల్చితే అక్కడే నీటి కరువు ఎక్కువ. అయినా అక్కడి రైతులు మల్బరీ చెట్ల సాగు ద్వారా మెరుగైన పలితాలను సాధించడం చూశా. దీంతో నేను ప్రయోగాత్మకంగా రెండు ఎకరాల్లో సాగు చేశా. మరో రెండేళ్లలో మల్బరీ మొక్కలు వృక్షాలుగా పెరుగుతాయి. అప్పుడు రైతులకు దీనితో కలిగే ఉపయోగాల గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. మామూలుగా 600 గూళ్లకు కిలో దిగుబడి వస్తే.. మల్బరీ చెట్ల ఆకులతో 380 గూళ్లకే కిలో దిగుబడి వచ్చిందని కర్ణాటక రైతులు తెలిపారు.  

మూడేళ్ల తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు :
ఎకరాలో మల్బరీ చెట్లు పెంచుతున్నా. 9“4 అడుగుల దూరంలో ఎకరానికి 1,800 మొక్కలను, 3 అడుగుల లోతులో నాటాము. 3 ఏళ్ల వరకు డ్రిప్‌తో నీరిస్తే తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు. 3–4 అడుగుల ఎత్తున ప్రూనింగ్‌ చేస్తాం. కొమ్మ పద్ధతిలో 2“2, 2“3 దూరంలో నాటిన మల్బరీ తోటలో.. ఏటా నేల మట్టానికి ప్రూనింగ్‌ చేసినప్పుడు 5% మొక్కలు చనిపోతాయి. 15 ఏళ్ల తర్వాత మళ్లీ నాటాలి. అయితే, మల్బరీ చెట్లు పెంచితే ఆ సమస్య ఉండదు. ఈ చెట్లు వందేళ్ల వరకు మల్బరీ ఆకు దిగుబడినిస్తాయి.

డిసెంబర్‌ నాటికి మల్బరీ చెట్ల సాగు పద్ధతి ఖరారు :

నీటి వసతి ఉన్న రైతులు మల్బరీ తోటల్లో సాధారణంగా ఎకరానికి 5,500 మొక్కలు నాటి, నెలకో పంట తీస్తున్నారు. నీరు పరిమితంగా ఉన్న రైతులు 8“8 దూరంలో ఎకరానికి 680 మల్బరీ చెట్లను 10–15% నీటితోనే సాగుచేయవచ్చు. ట్రాక్టరు, యంత్రాలను ఉపయోగించడం సులువు అవుతుంది. మైసూరులోని కేంద్రీయ పట్టు పరిశోధన, శిక్షణా సంస్థ (ఇది సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు పరిధిలో ఉంది)లో మల్బరీ చెట్ల పెంపకంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో సాగు పద్ధతి ఖరారవుతుంది. వీ1 లేదా జీ4 లేదా ఎం.ఎస్‌.జి–2 రకాలేవైనా వర్షాకాలంలో నాటుకోవచ్చు.


వీటి కోసం అనంతపురం జిల్లా రాప్తాడులోని పట్టు పరిశోధనా స్థానాన్ని సంప్రదించవచ్చు.
–
డా. జీ వీ ప్రసాద్‌ (94908 40430), శాస్త్రవేత్త, పరిశోధన విస్తరణ కేంద్రం,కేంద్రీయ పట్టు బోర్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా

మల్బరీ చెట్లతో లాభాలెన్నో..
►  
బోదెల (సాళ్లు) మధ్య దూరం 9 అడుగులు ఉంటుంది కాబట్టి.. మల్బరీ చెట్ల మధ్య ట్రాక్టరుతో సులభంగా అంతర కృషి చేసుకోవచ్చు. కలుపు కూలీల ఖర్చు తగ్గుతుంది..
►  
మల్బరీ చెట్లను నాలుగు అడుగుల ఎత్తులోనే కట్‌ చేసి మినీ ట్రాక్టర్‌ ట్రాలీలోకి వేసుకోవచ్చు.
►  
నలుగురు చేసే పనిని ఇద్దరు చేసుకోవచ్చు.
►  
గతంలో మాదిరిగా వారానికో తడి కాకుండా (మూడేళ్ల తర్వాత మల్బరీ చెట్లకు) నెలకోసారి నీటి తడులను అందివ్వొచ్చు.
►  
ఒక్కసారి డ్రిప్‌ పైపులను అమర్చితే చాలు. తరచూ మార్చాల్సిన పని ఉండదు.
►  
దీంతో మల్బరీ చెట్టుకు గుబురుగా కొమ్మలు పెరుగుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన 20 మల్బరీ మొక్కల నుంచి వచ్చే ఆకు దిగుబడిని ఒక చెట్టు నుంచే పొందవచ్చు.
►  
మల్బరీ చెట్లకు ఆకులు నాణ్యంగా, మందంగా పెరుగుతాయి. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి.
►  
నాలుగో జ్వరం దశ (చివరి ఆరు రోజులు) లో పట్టు పురుగులు మామూలుగా తీసుకునే ఆహారం కన్నా నాలుగు రెట్ల ఆకును అధికంగా తీసుకుంటాయి. ఈ చెట్ల నుంచి లభించే ఆకు నాణ్యంగా ఉండటం వల్ల పట్టు గూళ్ల దిగుబడి బాగుంటుంది.
►  
ఆకుల్లో తేమ తక్కువగా ఉండటం, పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పట్టు పురుగులకు మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. నాణ్యమైన ఆకును పురుగులు ఆహారంగా తీసుకోవడంతో రోగాల బెడద ఉండదు.
►  
చెట్లకు నాలుగు అడుగులపైన కొత్తగా వచ్చిన కొమ్మలకు ఆకు పెరుగుతుంది కాబట్టి పండు ఆకులు, మట్టి అంటిన ఆకుల సమస్య ఉండదు.
►  
మామూలు మల్బరీ ఆకుతో వంద పట్టు గుడ్లకు 70 కిలోల గూళ్ళు ఉత్పత్తి అవుతాయి. మల్బరీ చెట్ల నాణ్యమైన ఆకుతో వంద గుడ్లకు 90 కిలోలకు పైగా పంట వస్తుంది.
►  
వేసవిలో నీటి సమస్య ఉన్న రైతులకు మల్బరీ చెట్ల పెంపకం ఎంతో ఉపయోగకరం.

ముల్కనూర్‌కు మహిళా సంఘల బలం - Dairy Farming in India

ముల్కనూర్‌కు మహిళా సంఘల బలం



చేతితో విత్తనాలేసి బళ్లకు తిండి గింజలు ఎత్తే అన్నదాతే సమాజాభ్యున్నతికి, నాగరికత వికాసానికి జీవన రేఖ. ఇంతటి ఉత్కృష్టమైన వ్యవసాయ వృత్తి ద్వారా సమాజానికి ఆకలి తీర్చే అన్నదాతలు.. దురదృష్టవశాత్తూ కష్టాల కన్నీళ్లతో కడుపునింపుకోవాల్సిన దుస్థితి దేశమంతా అలముకుంది. అయితే, ఒంటరిగా ఉన్నప్పుడు వెంటాడిన బలహీనత.. నలుగురూ చేతులు కలిపినప్పుడు బలిష్ట శక్తిగా మారుతుంది. ఈ లక్ష్యంతోనే వ్యవసాయోత్పత్తిదారులను సంఘటిత పరిచేందుకు చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పరస్పర సహాయ సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్‌ కంపెనీలు(ఎఫ్‌.పి.సి.లు)గా ఏర్పడితే.. సాగు ఖర్చులు తగ్గించుకోవడం, తమ ఉత్పత్తులను తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటూ నికరాదాయాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందన్నది భావన. భావన మంచిదే∙అయినా.. విధాన లోపం వల్ల సహకార ఫలాలు రైతులకు బాసటగా నిలవలేకపోతున్నాయి. వ్యవసాయేతర స్థిరాస్తులు తనఖా పెడితేనే రుణాలిస్తామని బ్యాంకులు భీష్మిస్తున్నాయి. అందువల్లనే పట్టణ ప్రాంతాల్లోని బలమైన సొసైటీలే రుణాల్లో సింహభాగాన్ని తన్నుకుపోతున్నాయన్న విమర్శ ఉంది. గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలకు మాత్రం కష్టాలతో కాపురం తప్పటం లేదు!

♦ ‘మిల్క్‌’నూర్‌ డెయిరీ
♦ 
మహిళా రైతులకు ఆదాయ భద్రత!
♦ 
ముల్కనూర్‌ మహిళా రైతుల సహకార డెయిరీ దేశానికే ఆదర్శం
♦ 20
వేల మంది సభ్యులు.. 50 వేల పాడి పశువులు
♦ 
ఏటా రూ. 90 కోట్ల లావాదేవీల స్థాయికి దినదినాభివృద్ధి

తెలంగాణ మారుమూల పల్లెల్లో పుట్టిపెరిగిన ముల్కనూరు ప్రాంత మహిళా రైతులు ‘కవ్వమాడిన చోట కరువు ఉండదు’ అన్న పెద్దల మాటను వంట పట్టించుకున్నారు. వారు డిగ్రీలు చదువుకోలేదు, కానీ అక్షరాలు నేర్చుకున్నారు. చేయీ చేయీ కలిపి.. రూపాయికి రూపాయి జమ చేసి పొదుపు అలవాటు చేసుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు తాము కూడబెట్టుకున్న పొదుపు సొమ్ముతోనే ఏకంగా మహిళా డెయిరీనే నెలకొల్పి.. రూ. కోట్ల సంపదను సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత రూ. 90 కోట్ల వార్షిక లావాదేవీలు నిర్వహించే స్థితికి ఎదిగారు. తమ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా ఆదాయ భద్రతను చేకూర్చే వెలుగుబాట చూపారు. ముల్కనూరు రైతు మహిళలు చూపిన సహకార స్ఫూర్తి, పట్టుదల, కృషి, దృఢ సంకల్పానికి ఇవాళ దేశం యావత్తూ జేజేలు పలుకుతోంది...


‘
కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే సూక్తిని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ ప్రాంత మహిళా రైతుల సహకార స్ఫూర్తిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వరస కరువులతో పంటలు ఎండిపోతూ... పెట్టుబడులు కూడా తిరిగి రాని దైన్యం నుంచి గట్టెక్కేందుకు మహిళలు ఇంటికి ఒకటి, రెండు పాడి పశువులను పెంచుతూ పాల ఉత్పత్తితో ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. ముల్కనూర్‌ పేరును ‘మిల్క్‌’నూర్‌గా మార్చారు. దేశంలోనే ప్రప్రథమంగా ముల్కనూర్‌లో మహిళల భాగస్వామ్యంతో డెయిరీని నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం విశేషం.

1999
లో ముల్కనూరు మండలంలోని ముస్తఫాపూర్‌లో 20 మంది మహిళలు పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో ఆ గ్రామం, మండలంలోని మహిళలంతా పొదుపు ఉద్యమంలో చేరారు. మహిళా సంఘాలు చిన్నపాటి బ్యాంక్‌లుగా మారాయి. అలా కూడబెట్టిన సొంత సొమ్మును దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా పెట్టుబడి పెట్టడం ఎలా? అని ఆలోచిస్తూ మహిళా పొదుపు సంఘాల బాధ్యులు డెయిరీని నెలకొల్పాలని నిర్ణయించారు. రైతుల సహకారోద్యమానికి ముల్కనూరు అప్పటికే పెట్టింది పేరు. ముల్కనూరు రైతు సహకారోద్యమ నేత విశ్వనాథరెడ్డి చూపిన ‘సహకారం, సేవ’ లక్ష్యాల వెలుగులో మహిళలు సంఘటితంగా ముందుకు నడిచారు.

జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తోడ్పాటుతో కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌(సి.డి.ఎఫ్‌.) మార్కెట్‌ సర్వే చేసి, ముల్కనూరు ప్రాంతంలో డెయిరీ ఆవశ్యకత ఉందని నిర్ధారించింది. దేశంలోనే మొట్టమొదటిదైన ‘ముల్కనూరు మహిళా పరస్పర సహాయ సహకార డెయిరీ’ ఆ విధంగా రూపుదాల్చింది. స్వకృషి బ్రాండ్‌ పేరిట పాలను, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ, దినదినాభివృద్ధి సాధిస్తూ మహిళా సహకార స్ఫూర్తిని దశదిశలా చాటుతున్నారు. వీరి కృషికి మెచ్చి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ తదితర ప్రముఖులు కితాబునిచ్చారు.
గేదె పాలకు రూ.41.30.. ఆవు పాలకు రూ. 26.87..
ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ. 7 కోట్ల పెట్టుబడితో మండలంలోని ముల్కనూర్‌లో ఆగస్టు 17, 2002న డెయిరీ ప్రారంభమయింది. నేడు వరంగల్‌ అర్బన్, కరీంనగర్, సిద్ధిపేట, జనగామ జిల్లాల్లోని 140 గ్రామాల్లో 40వేలకు పైచిలుకు పాడి గేదెలు, ఆవులు ఉన్నాయి. పాల సంఘాల ద్వారా రోజూ 40 వేల లీటర్లకు పైగా సేకరిస్తున్నారు. గేదె పాలకు అత్యధికంగా సగటున లీటరుకు రూ.41.30, ఆవు పాలకు లీటర్‌కు రూ. 26.87 చెల్లిస్తున్నారు. ఇక అన్ని గ్రామాల్లోని పాల సంఘాలు కంప్యూటీకరించారు. 15 రోజులకోసారి రైతులకు నగదు చెల్లిస్తున్నారు.

ఏటా రూ. 90 కోట్ల వ్యాపారం
ముల్కనూర్‌ డెయిరీ ‘స్వకృషి’ బ్రాండ్‌ పేరుతో సుమారు 10 తెలంగాణ జిల్లాల్లో పాలు, పెరుగు, నెయ్యి, లస్సీ, స్వీట్‌ లస్సీ, మజ్జిగ, దూద్‌పేడ్, స్వీట్లు విక్రయిస్తుంది. 20 వేల సభ్యులతో ఏటా లాభాల బాటలో పయనిస్తున్నది. డెయిరీ పాలకవర్గ సభ్యులు 12 మంది ప్రతి నెలా సమావేశమై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటారు. డెయిరీ సిబ్బంది, పాల సంఘాల కార్యదర్శులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తారని జనరల్‌ మేనేజర్‌ మార్పాటి భాస్కర్‌రెడ్డి (99088 55114) తెలిపారు.

నాణ్యతలో రాజీ లేకుండా శుభ్రమైన, స్వచ్ఛమైన పాలు, పాలపదార్థాలను విక్రయిస్తున్నామని, రూ. 90 కోట్ల వార్షిక ఆర్థిక లావాదేవీలతో లాభాల బాటలో పయనిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నాలుగు సార్లు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. 2012 డిసెంబర్‌ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డును డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల అందుకున్నారు. వ్యవసాయంలో అధిక పని గంటలు శ్రమించే మహిళలు స్వయంగా డెయిరీని నెలకొల్పి అభ్యున్నతికి పాటుపడటం చాలా గొప్ప సంగతి.

ఒక ఆవుకు రూ. 22,500 మిగులుతయి!
ఎకరం భూమిలో పత్తి పంట పెడితే కాలం మంచిగ అయి పంట పండితే రూ. 30 వేలు వత్తయి. పెట్టుబడి పోను రూ. 15 వేలు లాభం ఉంటది. వర్షాలు లేకపోతే పంట పండది. అప్పులే మిగులుతాయి. ఒక ఆవును పెంచుకుంటే ఖర్చులు పోను 10 నెలల్లో రూ. 22,500 మిగులుతయి. మాకు 2 ఆవులున్నాయి. రోజూ 4 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తా. నెలకు రూ. 3 వేల పాల బిల్లు ఎత్తుకుంటా. ఈ డబ్బుతోనే మా కుటుంబం గడుస్తున్నది.

పోషకాలు లోపిస్తే... (PLANT NUTRIENT DEFICIENCIES)

పోషకాలు లోపిస్తే...  (PLANT NUTRIENT DEFICIENCIES)

- పోషకాలు తగు మోతాదులో అందితేనే మొక్కలలో పెరుగుదల సాధ్యం
- మొక్కలలో పోషక లోప లక్షణాలపై రైతులకు అవగాహన అవసరం

మొక్కలకు తగు మోతాదులో పోషకాలు అందనప్పుడు పెరుగుదల సక్రమంగా జరుగక దిగుబడు లు తగ్గుతాయి. మొక్కల్లో కనిపించే లక్షణాలను బట్టి పోషకాల లోపాన్ని గుర్తించాలి. ఆయా పోషకాలు గల ఎరువులు అందించాలి.నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతయి. లోపం తీవ్రత ఎక్కువైతే పొలం ఎండిపోయినట్లు కన్పిస్తుంది.
భాస్వరం లోపిస్తే మొక్క పెరుగుదల తగ్గి ముదురు ఆకు పచ్చరంగు కన్పిస్తుంది. ఆకులు చిన్నవిగా మారుతాయి. లోపం తీవ్రత ఎక్కువైతే ఆకుల అడుగుభాగాన గోధుమ రంగు మచ్చలేర్పడుతా యి. పొటాష్ లోపిస్తే ముదురు ఆకులు పసుపు పచ్చరంగులోకి మారుతాయి. ఆకుల చివర్లో తుప్పు మచ్చలేర్పడి ఆకుల అంచులు, కొనలు ముడుతపడి తర్వాత ఇరిగిపోతాయి. కాల్షియం లోపించినప్పుడు మొక్కలు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. కొత్తగా వచ్చే మొగ్గ ఆకులు పసుపు రంగుకు మారుతాయి. లోపం ఎక్కువైతే ఆకు అంచుల నుంచి ఎండటం మొదలవుతాయి. మెగ్నీషియం లోపించినప్పుడు ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారడం మొదలై తర్వాత ప్రధా న ఈనెకు ఇరువైపులా పసుపు పచ్చ మచ్చలేర్పడి ఇవి క్రమేపీ పెద్దవై ఆనెకు ఇరువైపులా తిరుగబడిన వి ఆకారంలో ఆకుపచ్చ భాగం మిగులుతుంది. లోపం తీవ్రత ఎక్కువైతే ఆకులు రాలిపోతాయి. 
గంధకం లోపిస్తే ఆకుల మీద పసుపు పచ్చ మచ్చలేర్పడుతాయి. ఆకులు పసుపురంగులోకి మారి ముడుచుకొని చిన్నగా అవుతాయి. మొక్కల్లో వేర్ల అభివృద్ధి ఆగిపోతుంది. జింక్ లోపిస్తే మొక్కల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారుతుంది. కొత్త ఆకులు చిన్న వై మొక్క కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకులపై తుప్పు రంగు మచ్చలేర్పడుతాయి. ఇనుము లోపిస్తే లేత ఆకులు పసుపు రంగులోకి, ఈనెలు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. లోపం మరీ ఎక్కువైతే ఆకుల ఈనెలు కూడా తెల్ల గా పాలిపోతాయి. బోరాన్ లోపం వల్ల కొత్తగా వచ్చే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చ రంగు కోల్పోవడం తెల్లని చారలు ఏర్పడటం, చిగురు ఆకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరుగడం మందంగా తయారవ్వడం ఉంటుంది. లోపం బాగా ఎక్కువుంటే మొక్క చివరి భాగంలో ని మొగ్గలు చనిపోతాయి. మొగ్గలు, లేత కాయల అడుగుభాగంలో పగుళ్ళు ఏర్పడుతాయి.మాంగనీస్ లోపిస్తే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఈనెలను ఆనుకొని ఉన్న భాగం మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది. 
మాలిబ్డినం లోపిస్తే ఆకులు లేత పసుపురంగులోకి మారుతాయి. ఈనెలు తప్ప మిగిలిన ఆకు భాగం మీద పసుపునుంచి నారింజ రంగు మచ్చలేర్పడుతాయి. లోపం ఉన్న చోట బంక కారుతుంది. రాగి ఇది లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపురంగులోకి మారుతుంది. కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. కొమ్మ ఎండిపోయి కాయలపై ఇటుక రంగు మచ్చలేర్పడుతాయి.

పత్తిలో గులాబీ పురుగు-నివారణ

పత్తిలో గులాబీ పురుగు-నివారణ

వానకాలంలో రైతులు ఎక్కువ మొత్తంలో పత్తి సాగు చేస్తున్నారు. వాతావరణంలో వచ్చి మార్పుల వల్ల పత్తి పంటకు కొత్త రోగాలు వస్తున్నాయి. వీటి నివారణకు అధిక పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సమయంలో పత్తికి గులాబీరంగు పురుగు ఆశించింది. వ్యవసాయశాఖాధికారులు పంటను పరిశీలించి వీటి నివారణకు రైతులకు సూచనలు ఇస్తున్నారు.పత్తి నాటిన 45 రోజుల్లో పూతకు వస్తుంది. ఈ పూత దశను కాపాడేందుకు రైతులు రసాయన మం దులు పిచికారీ చేస్తారు. దీనివల్ల పత్తి ఆకులు బాగానే ఉన్నప్పటికీ పూత రాలిపోతుంది. రైతులు పత్తి మొక్కను పరిశీలిస్తే తప్పా గుర్తించడం కష్టమని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. పత్తి ఆకుల్లో పురుగు ఉంటుంది. అది పైకి కనిపించేసరికి నష్టం జరుగుతుంది.

గులాబీ పురుగును గుర్తించడం

పువ్వులో ఎక్కువగా గులాబీ పురుగులుంటాయి. ఇవి ఆకుల కింది భాగాన లేత కొమ్మలు, కాయల పైన గుడ్లును పెడుతాయి. దాదాపు రెండు నుంచి మూడు వందల వరకు గుడ్లను పెడుతాయి. గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు మొగ్గులోకి తొలుచుకొనిపోతాయి. చిన్న కాయలకు కనిపించినంత చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి గింజలను తినివేస్తాయి. దీనివల్ల కాయల్లో దూది బరువు తగ్గిపోతుంది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.పత్తిలో గులాబీ పురుగు పెరుగడానికి కారణం పంటకు నీరుపెట్టి ఎరువులు వేసి పంట కాలాన్ని పొడిగిస్తారు. జనవరి తర్వాత పత్తి పంటను చేనులో ఉంచకూడదు. జనవరి తర్వాత చేను లోతుగా దుక్కులు దున్నుకుంటే పురుగు పెరిగే అవకాశం ఉండదు. ఎండకు భూమిలో ఉన్న తెగులు చనిపోతుంది.పత్తికి గులాబీ పురుగు నివారణకు పత్తి పంటలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డిపూలు, రాలిన పూత పిందెలను ఎప్పటికప్పుడు ఏరివేసి సమూలంగా నాశనం చేయాలి. 5 మిల్లిలీటర్ల వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రొఫెనోపాస్, థయోకికార్బ్, క్లోర్ పైరిపాస్, క్వినాల్‌పాస్, స్పైనోసాడ్‌తో పాటు రకాల రసాయన మందులను 45 నుంచి 120 రోజుల వరకు మార్చి మార్చి వాడాలి. దీంతో పత్తి పంటలో ఉన్న పురుగులు తగ్గిపోతా

మామిడి సాగులో (పూత/కాత) జాగ్రత్తలు Diseases of Mango and their Control


మామిడి సాగులో (పూత/కాత) జాగ్రత్తలు
Diseases of Mango and their Control

- పిండినల్లితోను ఇబ్బందే 
- పుత దశలో నివారించపోతే నష్టమే


మామిడి సాగు చేసిన రైతుకు ముందు చూపు అవసరం. మామిడి తోటల్లో సరైన యాజమాన్యం పాటించి సాగు చేస్తూ, మామిడి పూత, కాత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సా ధ్యం. మామిడి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే చిట్కాలు, నవంబర్‌లో రైతులు పాటించాల్సిన పద్ధతులను మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారి సౌమ్య వివరించారు.

జిల్లాలో 25 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు, చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడుల్లో తగ్గుదల, నాణ్యత తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు అవగాహన లేమితో తమకు తోచిన విధంగా సేద్యం పనులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. నవంబర్‌లో మామిడి రైతులు చేపట్టాల్సిన, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఇవీ.

 చేయాల్సిన పని:
 
ఈ నెలలో చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి.
 
సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయరాదు.
 
ముఖ్యంగా ఈ నెలలో రైతులు ఎలాంటి కత్తిరింపులు చేపట్టకూడదు. నీటిని కూడా వదలొద్దు.
 
ఒక్కోసారి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. వాటిని ఉత్తేజ పరిచి పూత త్వరగా రావడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ కింది పద్ధతులు పాటించాలి.
 
నీటి వసతి ఉన్న తోటల్లో తేలికపాటి తడి ఇవ్వడం లేదా లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం, నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు వస్తాయి.
 
 
సస్యరక్షణ తప్పనిసరి :
 
మామిడి పూతకు ముందు, పూత సమయం, కాయ ఎదిగే దశలో అనేక రకాల పురగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. అలాగే సరైన నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం సరిగా చేపట్టని తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోయి, కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. దీని నివారణకు కింది జాగ్రత్తలు పాటించాలి.

 బూడిద తెగులు :
 
లేత ఆకులు, పూత, కాండాలను, పూల మీద, చిరుపిందెల మీద, తెల్లని పౌడరు లాంటి బూజు రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి.

 నివారణ :
 
మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం(నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేయాలి
 
పూత దశలో తెగులు కనిపించిన హెక్సాకోన జోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా డినోకాప్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు చొప్పున నీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకుపచ్చ/పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు :
 
వర్షాలు/పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. ఈ తెగులు లేత ఆకులు, పూలు, పండ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పోయి ఆకు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి.
 నివారణ :
 
పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి.
 
సూర్యరశ్మి సోకేలా కొమ్మలను జూన్, జూలై మాసంలో కత్తిరింపులు చేసి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి.
 
పూతకు ముందే 3 గ్రాముల కాపర్ ఆక్సీ ఫ్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 
పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్, మిథైల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మండోజెల్ లేదా రెండు గ్రాముల ఆంట్రాకాల్ కలిపి స్ప్రే చేయాలి.

తేనె మంచు పురుగులు :
 
తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు, పూత మాడిపోతాయి. పిందెలు ఏర్పడవు, ఏర్పడినా బలహీనంగా ఉండి రాలి పోతాయి. అంతేకాకుండా తేనెలాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జింజడం వల్ల ఆకులు, కాండాలు, కాయలపై మసి పొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణ జన్య సంయోజన క్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి, నాణ్యత కోల్పోతాయి.

 నివారణ :
 
పూత మొగ్గ దశలో : లీటరు నీటికి 1 మిల్లీలీటరు డైక్లోరోఫాస్ లేదా 3 గ్రాముల కార్బోరిల్ కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేయాలి.
 
పచ్చపూత దశ : పూత కాండలు బయటకు వచ్చి, పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయాలి.
 
నల్లపూత దశ : ఈ దశలో పిందెలు బఠాణి గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. లీటరు నీటికి ఒక మిల్లీలీటరు పాస్పోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా గ్రాము ఎఫిసేట్ కలిపి పిచికారీ చేయాలి.

 
తామర పురుగులు :
 ఈ పురుగులు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై గోకి బయటకు వచ్చి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి గ్రాము ఎఫిసేట్ లేదా 1 మిల్లీలీటరు పాసోమిడాన్ లేదా 2 మిల్లీలీటరు రిజెంటును కలిపి పిచికారీ చేయాలి.